ఆదిలాబాద్ లోని సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్‌పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు పేర్కొన్నారు. తమకు ఉపాధి లభించడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గతంలో తాము సీసీఐకి భూములు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐని తిరిగి ప్రారంభించాలని లేనిపక్షంలో తమ భూములను తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.