వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కి. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును తిరుపతి – శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం’లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి హాజరు కానున్నారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ వేడుకకి తరలివచ్చారు.మైదానంలో ఎటు చూసినా కాషాయరంగు జెండాలు కనిపిస్తున్నాయి. ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సీతారాముల దివ్యచరితను లవకుశుల వేషధారణలో ఉన్న పిల్లలు చేసే గానంతో, ఈ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే ముఖ్య అతిథులు రావడం మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *