ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో విడుదల చేసిన టీజర్ నిరాశ పరిచినా, ట్రైలర్ విడుదల రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమా పై మళ్లీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్ లో కన్నా నార్త్ లో ఆదిపురుష్ మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతుండడం విశేషం. జూన్ 16న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత స్పీడుగా చేస్తుంది. అదే సమయంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ వేగం పెంచారు.ఈ సినిమాకు రన్ టైమ్ ఏకంగా 174 నిమిషాలు. అంటే.. రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఫైనల్ చేశారట. ఈ లెక్కన దాదాపు మూడు గంటల పాటు రన్ టైంతో ఆదిపురుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట. వాస్తవానికి ఈ చిత్రం నిడివి మూడు గంటలకు పైగానే వచ్చిందట. కానీ అంత సేపు ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినట్లు అవుతుందని భావించిన చిత్ర యూనిట్ చాలా వరకు ఎడిట్ చేసిందట.

ఇలా చివరికి మూడు గంటల లోపే దీన్ని ఫైనల్ చేశారని తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ మూవీ నుంచి వరుసగా సర్ప్రైజ్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయగా.. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే మే 20వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన జై శ్రీరామ్ అంటూ సాగే మొదటి సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *