మహేష్‌ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో మూవీ ప్రకటించినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దీన్ని ర్మిస్తున్నారు. పూజా హేగ్డే, శ్రీలీల కథానాయకలు కాగా జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ నెల 31న ఈ మూవీ టీజర్, సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు.

ఇక రాజమౌళితో చేయనున్న మూవీకి సంబంధించి విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేశారని తెలిసింది. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు కనీసం ఆరు నెలల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తుంటారు. ఆ వర్క్ షాప్ లో స్క్రిప్ట్ గురించి చర్చించడంతో పాటు నటీనటులకు పాత్ర పై  పూర్తి అవగాహన కల్పిస్తూ అన్ని విషయాల పై ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు అదే తరహాలో రాజమౌళి.. మహేష్ బాబు సినిమా కోసం కూడా వర్క్ షాపు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నుండి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వర్క్ షాప్ మొదలు పెట్టనున్నారని సమాచారం.

మహేష్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లు రాజమౌళితో చేయనున్న సినిమాకి కేటాయించనున్నారని తెలిసింది. దీన్ని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. ఆల్రెడీ హాలీవుడ్ సంస్థలతో బిజినెస్ డీల్ కూడా కుదిరిందని టాక్ వినిపిస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో మహేష్‌, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *