Tuesday, March 17, 2026
Homeసినిమాఆదిపురుష్ టీజ‌ర్ డేట్ మారిందా?

ఆదిపురుష్ టీజ‌ర్ డేట్ మారిందా?

ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్‌‘. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ఈ చిత్రానికి  ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామాయ‌ణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ మూవీలో ప్ర‌భాస్ రాముడుగా న‌టిస్తే.. కృతి స‌న‌న్ సీత‌గా న‌టించింది. సైఫ్ ఆలీఖాన్ రావ‌ణుడుగా న‌టించారు. ప్ర‌భాస్ రాముడుగా ఎలా ఉంటాడో చూడాల‌ని ప్రేక్షకులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌లేదు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారింద‌ని తెలిసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..  ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని అక్టోబర్ 3న అయోధ్య లో ఒక స్పెషల్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతున్నట్లు స‌మాచారం.

ఇటీవల షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్ కి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ అఫెక్ట్స్ వర్క్ వేగంగా జరుగుతోంది. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన‌ ఆదిపురుష్ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ కానుంది. టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్, సంస్థలు కలిసి భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఆదిపురుష్ 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Also Read: అభిమానుల‌కు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular