Thursday, March 28, 2024
Homeసినిమాఅభిమానుల‌కు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్?

అభిమానుల‌కు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్?

ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్‌‘. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం ఈ చిత్రానికి వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడుగా; బాలీవుడ్ నటి కృతి స‌న‌న్ సీత‌గా న‌టిస్తున్నారు.  హీరో సైఫ్ ఆలీఖాన్ రావ‌ణుడుగా న‌టించారు. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి శ్రీరాముడుగా ప్ర‌భాస్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిపురుష్ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. శ్రీరామ న‌వ‌మికి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని ఎదురు చూసిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు అక్టోబ‌ర్ 23. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ మాత్ర‌మే కాకుండా.. టీజ‌ర్ కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. టీజ‌ర్ రిలీజ్ చేయ‌డంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. సాహో, రాధేశ్యామ్ చిత్రాల‌తో నిరాశ ప‌రిచిన ప్ర‌భాస్.. ఆదిపురుష్ మూవీతో మెప్పించి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.

Also Read : ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్