Wednesday, April 17, 2024
Homeసినిమా'అదిరిందే' అంటూ నితిన్, కృతి ఆటా పాటా

‘అదిరిందే’ అంటూ నితిన్, కృతి ఆటా పాటా

వెర్సటైల్ హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట ‘అదిరిందే’ పాట తాజాగా విడుదలైంది.

స్వర సాగర్ ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్ తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. పాట చెవులకింపుగా వుంది. పాటలో నితిన్, కృతి శెట్టిలా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీస్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స మూమెంట్స్ అలరించాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది.

కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ ‘రారా రెడ్డి’లో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్