Friday, March 29, 2024
HomeTrending Newsవరద ప్రాతాల పర్యటనకు సిఎం జగన్

వరద ప్రాతాల పర్యటనకు సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి అందిన, అందుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీస్తారు.  ఇటీవలి భారీ వరదలకు పూర్తిగా నీట మునిగిన గోదావరి లంక గ్రామాలను సందర్శిస్తారు. తొలిరోజు కోనసీమ జిల్లాలో  పి.గన్నవరం, రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, గంటి పెదపూడి లంక, పుచ్చకాయల వారి పేట, అరిగెలవారి పేట గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు.

రెండోరోజు పర్యటనలో పశ్చిమ గోదావరి జిల్లలో సిఎం జగన్ పర్యటన ఉంటుంది. అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ వారంలో కూడా భారీ వర్షాలు ఉంటాయని, గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ సూచనలతో  మంగళవారం నాటి వాతావరణ పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Also Read : గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్: కేసీఆర్ డౌట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్