మే 27న అడివి శేష్ ‘మేజ‌ర్‌’

Major on May 27: ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాదుల దాడిలో మేజర్ ఉన్ని కృష్ణ‌న్ అమ‌రుడ‌య్యారు. ఆయ‌న పాత్ర‌ను ఆధారంగా చేసుకుని అడివి శేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్‌, AS మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ బ్యాన‌ర్స్ పై శశి కిరణ్ తిక్కా తెర‌కెక్కిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా వాయిదా పడుతూ వ‌చ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈరోజు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

మే 27న ‘మేజర్’ మూవీ తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పరంగా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత అడివి శేష్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంద‌రూ మేజ‌ర్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : మహేష్, దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *