అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్య నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అమ్మాయిలను వర్సిటీల్లోకి అనుమతించే వరకు క్లాసులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఉన్నత విద్యను దూరంచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమ్మాయిలకు వర్సిటీ విద్యపై తాలిబన్ ప్రభుత్వం గతవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. మహిళలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం అక్కర్లేదని విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం అన్నారు. యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు తాలిబన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఎన్జీవోల్లో మహిళలకు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ మూడు స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకాలాపాలను నిలిపివేశాయి. సేవ్ ది చిల్డ్రన్, ది నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, కేర్ అనే మూడు సంస్థలు ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ కార్యకలాపాలను ఆపివేశాయి.
Also Read : మహిళలకు యూనివర్సిటీ విద్యపై తాలిబాన్ల ఆంక్షలు