పాకిస్తాన్ తో జరిగిన తొలి టి 20లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య షార్జా వేదికగా మూడు మ్యాచ్ ల టి 20సిరీస్ జరుగుతోంది. ఆఫ్ఘన్ బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేయగలిగింది. ఇమాద్ వసీం-18; సయీం ఆయూబ్-17; తయ్యబ్ తాహీర్-16; షాదాబ్ ఖాన్-12 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి, ముజీబ్, నబి తలా రెండు; అజ్మతుల్లా, నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ 27 పరుగులకే మూడు వికెట్లు (ఇబ్రహీం జార్డాన్-9; గుల్బడిన్ నబి డకౌట్; రహమతుల్లా గుర్జాబ్- 16) కోల్పోయింది. కరీం జనత్ కూడా 7పరుగులకే వెనుదిరిగాడు. మహమ్మద్ నబి క్రీజులో నిలదొక్కుకొని 38; నజీబుల్లా జర్డాన్-17 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
పాక్ బౌలర్లలో ఇషానుల్లా 2; నసీం షా, ఇమాద్ వసీం చెరో వికెట్ పడగొట్టారు.
మహమ్మద్ నబీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.