హైద‌రాబాద్ న‌గ‌రంలోని అబిడ్స్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ కార్ల షెడ్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే షెడ్డంతా మంట‌లు వ్యాపించి, పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి.

మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మంట‌లు ఎగిసిపడుతుండ‌టంతో.. స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.

మొత్తం ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీగార్డు స‌జీవ‌ద‌హ‌న‌మైన‌ట్లు నిర్ధారించారు. మృతుడిని సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *