Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Ibrahim Zadran: శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ విజయం

Ibrahim Zadran: శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ విజయం

శ్రీలంకతో ఆ దేశంలో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జర్డాన్ 98 పరుగులు (98 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రహ్మత్ షా 55 పరుగులతో రాణించాడు.

హాంబంతోటలోని మహీంద్ర రాజపక్ష ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ బౌలింగ్ ఎంచుకుంది.  లంక బ్యాట్స్ మెన్ అసలంక-91; ధనుంజయ డిసిల్వా-51; పాథుమ్ నిశాంక-38 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లో 268 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.  ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి, ఫరీద్ అహ్మద్ చెరో 2; అజంతుల్లా, ముజీబ్, నూర్ అహ్మద్, నబి తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఆఫ్ఘన్ 25 పరుగులకే ఓపెనర్ రహమతుల్లా గుర్జాబ్ (14) వికెట్ కోల్పోయినా జర్డాన్- రహ్మత్ షా రెండో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు.

ఇబ్రాహీం జర్డాన్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఇదే స్టేడియంలో జూన్ 4, 7 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్