Saturday, January 18, 2025
Homeసినిమాఇంతకీ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరబ్బా?!

ఇంతకీ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరబ్బా?!

ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. కొరటాలతో ఈ సినిమా ఉండనుంది. ‘ఆర్ ఆర్ ఆర్‘ రిలీజ్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే ‘ఆచార్య’ దెబ్బకొట్టడంతో దాని నుంచి తేరుకోవడానికి కొరటాలకి కొంత సమయం పట్టింది. ఇక స్క్రిప్ట్ లో పాన్ ఇండియా స్థాయిలో మార్పులు చేయవలసి రావడం కూడా ఒక కారణమైంది. ‘ఆర్ ఆర్ ఆర్’ లో కొమరం భీమ్ పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం బరువు తగ్గవలసి రావడం మరో కారణంగా కనిపిస్తోంది.

ఇలా కొరటాల – ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రాజెక్టుపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనేది ఆ ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ ప్రాజెక్టు ఆరంభంలో అలియా భట్ పేరు వినిపించింది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో చరణ్ జోడీగా మెప్పించిన అలియా, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సందడి చేయనుందని అంతా అనుకున్నారు. ఆ విషయం ఏమైందో తెలియదుగానీ, కియారా అద్వాని పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం శంకర్ సినిమాలో చరణ్ జోడీ కట్టిన ఆమె, ఆ తరువాత చేయనున్నది ఎన్టీఆర్ తోనే అని చెప్పుకున్నారు.

హమ్మయ్య మొత్తానికి ఎన్టీఆర్ కి ఒక హీరోయిన్ దొరికిందని కాస్త తేలికగా ఊపిరి పీల్చుకుందామంటే, తాజాగా తెరపైకి జాన్వీ కపూర్ పేరు వచ్చి చేరింది. తనకి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమంటుంది ఈ బ్యూటీ .. కానీ తెలుగు సినిమాలు చేయడంలో వెంటనే ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఎంతసేపూ ఊరిస్తుందే తప్ప అది నిజం కావడానికి మాత్రం ట్రై చేయడం లేదు. మరి ఎన్టీఆర్ సినిమా విషయంలో అది నిజమవుతుందేమో తెలియదు. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో పరిగెడుతుండగా .. బాలీవుడ్ భామలంతా టాలీవుడ్ బాట పడుతుండగా .. జాన్వీ కూడా ఇటువైపు అడుగులు వేస్తుందేమో చూడాలి.

Also Read: ఎన్టీఆర్, కొర‌టాల మూవీలో శ్రీవల్లి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్