Monday, May 20, 2024
Homeసినిమా'ఏజెంట్' ను మళ్లీ ఎడిటింగ్ చేస్తున్నారా..?

‘ఏజెంట్’ ను మళ్లీ ఎడిటింగ్ చేస్తున్నారా..?

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. అందర్నీ ఏజెంట్ నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏజెంట్ మూవీని మళ్లీ కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదేంటి ఏజెంట్ మూవీ రిలీజ్ అయిపోయింది కదా.. ఇప్పుడు మళ్లీ ఎడిటింగ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. ఓటీటీ కోసం మళ్లీ ఎడిటింగ్ చేస్తున్నారట.

ఆ మధ్య ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ ప్రకటన వచ్చింది కానీ ఆ రోజు స్ట్రీమింగ్ అవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో లేదా వారం రోజుల్లో ఏజెంట్ సినిమా ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు కానీ.. రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ చివర్లో ఏజెంట్ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. థియేట్రికల్ రిలీజ్ కు ముందు ఎడిటింగ్ కు ఎక్కువ సమయం లభించలేదట. దాంతో ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ లో ఏజెంట్ సినిమాతో యూనిట్ సభ్యులు కుస్తీపడుతున్నారని టాక్.

ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేదు కానీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం అని ప్రచారం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓటీటీ కోసం ఎడిటింగ్ చేసి ఏం లాభం..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయిపోయిన పెళ్లికి భాజాల పేరుతో సమయం వృధా చేయడం తప్పా మరేం లేదని.. వెంటనే ఏజెంట్ ను స్ట్రీమింగ్ చేయడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. ఏజెంట్ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై జరుగుతున్న ప్రచారం గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్