Friday, May 31, 2024
Homeసినిమా'ఆదిపురుష్' మేకర్స్ ఇలా చేశారంటి..?

‘ఆదిపురుష్’ మేకర్స్ ఇలా చేశారంటి..?

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. టీజర్ చూసి ఏముంటుందిలే అనుకన్నవారు సైతం ఇందులో ఏదో విషయం ఉన్నట్టుంది అనే అభిప్రాయానికి వచ్చారు. టీజర్ పై వచ్చిన విమర్శలతో అలర్ట్ అయిన మేకర్స్ ట్రైలర్ తో మెప్పించారు. జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇటీవల ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అయితే.. మేకర్స్ వీడియో సాంగ్ నుంచి కొత్త విజువల్స్ ని మరీ ఎక్కువగా రివీల్ చేసేస్తుండడం సినిమా పై ఆసక్తిని సస్పెన్స్ ఫ్యాక్టర్ ని తగ్గించేస్తుందని.. ఇలా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాం సీతా రాం సాంగ్ లోనే కీలమైన ఎమోషనల్ సీన్ ని చూపించేసారు. సాంగ్ లాస్ట్ లో తన సీతను రాముడు చేరుకున్నపుడు ఇద్దరి నడుమ సీన్ ఎంత కీలకం? అలాంటి అపురూపమైన సీక్వెన్స్ ని సాంగ్ తో సింపుల్ గా రివీల్ చేసేసారు.

కీలకమైన సీన్స్ ని బిగ్ స్ర్కీన్స్ పై మొదటిసారి చూస్తే ఎమోషనల్ ఫీలింగ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. అలా కాకుండా వీడియో సాంగ్స్ లో చూపించేస్తే.. ఆ థ్రిల్ ఫీలింగ్ మిస్ అవుతుంది. ఇలాంటివి నెక్ట్స్ అప్ డేట్స్ లో లేకుండా చూసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఆదిపురుష్ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రబాస్ ఆ రేంజ్ సక్సెస్ సాధించలేదు. మరి.. ఆదిపురుష్ బాహుబలి రేంజ్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్