Sunday, March 15, 2026
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ మారిందా?

అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ మారిందా?

Agent Late: యూత్ కింగ్ అఖిల్, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘ఏజెంట్‘. అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఏజెంట్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌ర్వాత అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. దీంతో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఆగ‌ష్టు 12న ఏజెంట్ రిలీజ్ అని మేక‌ర్స్ గ‌తంలో అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడు ఆగ‌ష్టు 12న ఏజెంట్ మూవీ రిలీజ్ కావ‌డం లేద‌ని… వాయిదా ప‌డింద‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే.. షూటింగ్ ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ట‌. అందుచేత ఏజెంట్ వాయిదా ప‌డింద‌ని.. సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. మేక‌ర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.

సెప్టెంబ‌ర్ లో స‌రైన డేట్ కోసం చూస్తున్నార‌ట‌. అంతా సెట్ అయిన త‌ర్వాత‌.. రిలీజ్ డేట్ పై మ‌రోసారి క్లారిటీ ఇస్తార‌ని తెలిసింది. ఇటీవ‌ల వైజాగ్ లో షూటింగ్ చేసిన‌ప్పుడు ఏజెంట్ యాక్ష‌న్ పార్ట్ కాస్త లీకైంది. ఆ వీడియోలో అఖిల్ యాక్ష‌న్ అద‌ర‌గొట్టేశాడ‌ని వీడియో చూసిన వాళ్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్ట‌డంతో ఏజెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయం అనే టాక్ మొద‌లైంది.

Also Read : కులుమనాలి లో ‘ఏజెంట్’ ఏం చేస్తాడో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular