కులుమనాలి లో ‘ఏజెంట్’ ఏం చేస్తాడో?

Agent: అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేక‌పోయినా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ అవ్వ‌డంతో ఏజెంట్ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాతో అఖిల్ నుంచి అభిమానులు ఏ స్థాయి స‌క్సెస్ ఆశిస్తున్నారో ఆ రేంజ్ స‌క్స‌స్ ని ఏజెంట్ అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు మేక‌ర్స్.

ప్ర‌స్తుతం ఏజెంట్ మూవీ వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజా అప్ డేట్ ఏంటంటే… మే 10 నుండి 20 రోజులు కులుమనాలిలో షూటింగ్ చేయ‌నున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యం లో భారీ ఛేజింగ్ ఫైట్ షూట్ చేయ‌నున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌మ్ముట్టి, అఖిల్.. పై వ‌చ్చే స‌న్నివేశాలు ఆడియ‌న్స్ కి థ్రిల్ క‌లిగించేలా ఉంటాయ‌ని స‌మాచారం. ఆగష్టు 12న ఈ ఏజెంట్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Also Read : వైజాగ్ లో.. ‘ఏజెంట్’ వార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *