Massive Dust Storm : ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా వర్షం కూడా పడుతోంది. దుమ్ము, ధూళి కారణంగా దగ్గరగా వచ్చే వాహనాలు కూడా కనపడటం లేదు. దీంతో వాహనదారులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దుమ్ము, ధూళితో జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ధూళితో కూడిన వేడి గాలులు వీస్తుండటంతో హస్తినలో భగభగ మంటోంది. రాత్రి పది గంటల వరకు దేశ రాజధానిలో ఇదే పరిస్థితి నెలకొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో రోడ్లను దుమ్ముతో పాటు చెట్ల ఆకులు కప్పేశాయి.

ఉత్తరాన హిమాలయాల నుంచి వస్తున్న గాలులతో ఓ వైపు ఉరుములు, మెరుపులతో కూడిన చెదురు మొదురు వర్షాలు…మరోవైపు పశ్చిమం నుంచి హర్యానా, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి వస్తున్న వేడిగాలితో భరించలేనంత ఇక్కపోత ఢిల్లీ నగరంలో ఒకో ప్రాంతంలో ఒక తీరుగా ఉంది. వీటికి దుమ్ము, ధూళి తోడవటంతో ఢిల్లీ వాసుల కష్టాలు అంతా ఇంత కాదు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా చీకట్లు కమ్మేశాయి. అంధకార పరిస్థితులేర్పడ్డాయి.

దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో లోహ విహంగాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.  దేశీయ విమానాల్ని లక్నో, అగ్ర, చండీగడ్ తదితర నగరాలకు మళ్ళిస్తున్నారు. ఢిల్లీకి  అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు దిగటం  ప్రారంభం అయింది.

Also Read : ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *