Friday, April 26, 2024
HomeTrending Newsతెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు - మంత్రి హరీష్

తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు – మంత్రి హరీష్

మానుకోట ఉద్యమాన్ని దశ-దిశ తిప్పడంలో పోరాడిందని, తెలంగాణ వచ్చింది కనుకనే…మాను కోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మానుకోటలో 550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్తాపన చేసుకోవడం చిన్న విషయం కాదని, నిజంగా తెలంగాణ రాకపోతే ఇది అయ్యేదా అన్నారు. తెలంగాణ రాకముందు 3 మెడికల్ కాలేజిలు మాత్రమే వచ్చాయి. 75 ఏళ్లు కాంగ్రెస్,టీడీపీలు పాలించాయి. నిజామాబాద్,ఆదిలాబాద్, వరంగల్ లో మాత్రమే వచ్చాయి. మహబూబాబాదు జిల్లా ప్రధాన ఆసుపత్రి నూతన భవనానికి, రు. 510 కోట్లతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అంతకుముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంబించిన ఆర్థిక ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.

700 మెడికల్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో తెలంగాణ రాకముందు ఉండేవి. ఏడేళ్లలో 2840 మెడికల్ సీట్లకు పెంచుకున్నం. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 5420 మెడికల్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండనున్నాయని మంత్రి వెల్లడించారు. పిల్లలకు చదువులు రావాలి. గిరిజన విద్యార్థులు డాక్టర్లు కావాలని సీఎం ఆకాంక్ష అన్నారు. మహబూబాద్ లో వంద పడకల ఆసుపత్రి ఉండేది. పది మంది డాక్టర్లు ఉండేవారని, రేపు 650 పడకలకు పెరగనుంది. వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. ఇంతకాలం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి పెద్దాపరేషన్ల పేరు మీద ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ప్రభుత్వ ఆసుపత్రులకు రండి. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నం. అన్ని రకాల వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు ఉపయోగించుకోండని మంత్రి కోరారు.

అర్భన్ పీహెచ్ సీ బిల్డింగ్లేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదన్నరు. 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేస్తున్నం. మహబూబాద్ లో అర్భన్ పీహెచ్ సీ పక్కా భవనం కట్టిస్తం. అయోధ్యపురం పీహెచ్ సీ బిల్డింగ్ లేదన్నరు. దానికి మరో 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేసి పక్కా భవనం కట్టిస్తం. 15 చోట్ల రెంటెండ్ బిల్డింగ్స్ లో ఎ.ఎన్.ఎం సెంటర్ ఉన్నయి పక్కా భవనాలు లేవన్నరని, వాటికి నిధులు 20 లక్షలు ఒక్కోదానికి మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

మరిపెడ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తం. పల్లె దవాఖానా నర్సింహపెటలో అందుబాటులో తెస్తం. బలపాల పీహెచ్ సీ బిల్డింగ్ లేదన్నరు. దానికి 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేస్తం.తొర్రూరు ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తం. పెద్ద వంగరలో పల్లే దవాఖానా అడిగారు. దాన్ని మంజూరు చేస్తమన్నారు.  కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు రాదన్నరు. చీకటి అవుతుంది తెలంగాణ అన్నడు. మనకు వెలుతురు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డికి చీకటి వచ్చింది. తెలంగాణ తెచ్చిన పట్టుదల గల నాయకుడు కేసీఆర్ గనుక కరెంటు వచ్చింది. బిజెపి నేత నడ్డా వచ్చిండు మొన్న. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఒక్క ఎకరానికి రాలేదన్నడు. ఆయన్ను తెచ్చి డీబీఎం 48 లో ఎత్తేస్తే తెలుస్తది. వెన్నారం దాకా నీరు పారుతున్నయంటే కాళేశ్వంర నీరు మిడ్ మానేరులోపడ్డయి. మిడ్ మానేరు నుండి ఎస్సారెస్పీ నుండి వెన్నారం దాకా నీరు వచ్చినయి.

బీజేపీ వాళ్లు ఒక్క ఎకరానికి నీళ్లు వచ్చినయా అని అడుగుతు్న్నరు. మా సిద్దిపేటకు రా..దుబ్బాకకు రా..గజ్వేల్ కు రా,,డోర్నకల్ రా.. కాళేశ్వరం నీటితో పంటలు పండుతున్నయా లేదా చూడు. మా రైతులు చెబుతురు అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పేవి అబద్దాలు. అబద్దాలకు నోబెల్ ప్రైజ్ ఇస్తే అది బీజేపీకే వస్తది. కాళేశ్వరం నీరు రాలేదంటే ఇంతకన్న జూటా మాట ఉంటదా అని మంత్రి హరీష్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పని చేసే పార్టీ. ఈ జాతీయపార్టీలు తెలంగాణకు హని చేస్తున్నాయి. తెలంగాణకు పని చేసే పార్టీలు ఉండాలా…. హని చేసి పార్టీలు ఉండాలా..అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని కేసు వేస్తడు. బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తడు. మిషన్ భగీరథ పనులు ఆపాలని, ఎంక్వైరీ చేయాలని ఉత్తరం రాస్తరు. మీరుఏమీ చేయరు. చేసే టీఆర్ఎస్ పార్టీని అడ్డుకుంటరని మంత్రి విమర్శించారు.

జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేసిందే తప్ప మేలు చేసిందేమి లేదు. బయ్యారం ఫ్యాక్టరీకి, గిరిజన యూనివర్సిటీకి,వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి అతీ గతీ లేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వరు. బాయిల కాడ మీటర్లు, బోర్ల కాడ మీటర్లు పెట్టమండరు. మీటర్లు పెడితే పైసలు ఇస్తం. లేదంటే ఇవ్వమని 25 వేల కోట్లు విడుదల చేస్తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నరని ఆరోపించారు. కాంగ్రెస్- బీజేపీలు ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కుట్రలు చేస్తున్నరు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సాధారణ కాన్పులు చేస్తే ప్రోత్సాహకాలు – మంత్రి హరీష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్