Air Pollution In Delhi :
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ మరింత పెరిగిపోతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడంతో దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దిల్లీలో వాయు నాణ్యత సూచీ తాజాగా 390కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన సంస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో కొంత మెరుగుపడే అవకాశం ఉంది.
గాలి నాణ్యత సూచి (Air Quality Index) ప్రకారం 0-50 మధ్య ఉంటె మంచిది పరిగణిస్తారు. 51-100 వరకు సంతృప్తికరమైనది, 101-200 మోస్తారు, 210-300 నిరాశజనకం, 301-400 చాలా తక్కువ స్థాయి, 401-500 దాటితే చాలా తీవ్రమైన/ ప్రమాదకరమైన స్థాయిగా పరిగణిస్తారు.
మొత్తంగా దేశరాజధానిలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో (Air Quality Index India) కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్.. 400 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ ఢిల్లీ ప్రాంతంలో(378), లోధి రోడ్డు(387 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయం, ఇండియా గేట్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆకాశంలో పొగమంచు పొరలా ఆవరించింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాయు కాలుష్యానికి తోడు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఈ రోజు ఉదయం ఢిల్లీలో 13.8 డిగ్రీలుగా నమోదైంది.
ఢిల్లీ సమీపంలోని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో వరి కోతలు యంత్రాలతో జరుగుతున్నాయి. యంత్రాలతో కోతలు జరపటంతో కింది వరకు కాకుండా పైనే కోతలు జరిగి వరి అడుగుభాగం కొయ్యలుగా అలాగే ఉండిపోతున్నాయి. మళ్ళీ సాగు చేసేందుకు అనువుగా లేక పోవటంతో మిగిలిన వరి కొయ్యలను నిప్పు పెట్టి కాల్చటం అక్కడి రైతాంగానికి అలవాటుగా మారింది. అందరు అదే పనిగా కాల్చటంతో గతంలో పొగ కమ్ముకునేది. కాలక్రమంలో అది వాయు కాలుష్యం పెంచేలా దోహదం చేస్తోంది.
ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్ సర్కారు (Delhi Govt Air Pollution) ఇప్పటికే చర్యలు చేపట్టింది. రహదారుల మీద నీటిని చల్లేందుకు వాటర్ ట్యాంకర్లను మోహరించింది.
Also Read :