Tuesday, March 17, 2026
Homeసినిమాఫిబ్రవరి 24న అజిత్ ‘వాలిమై’ గ్రాండ్ రిలీజ్

ఫిబ్రవరి 24న అజిత్ ‘వాలిమై’ గ్రాండ్ రిలీజ్

Valimai this month: అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు చిత్రయూనిట్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 24 న సినిమా విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది, దీనితో విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసారు జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థలు. బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ “ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసాం. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్యంతం ఉంటుంది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది

“అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు.  కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియ‌న్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటించారు. ఖ‌చ్చితంగా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular