Friday, March 29, 2024
HomeTrending Newsఅర్ధం చేసుకోండి: ఉద్యోగులకు మంత్రుల విజ్ఞప్తి

అర్ధం చేసుకోండి: ఉద్యోగులకు మంత్రుల విజ్ఞప్తి

Call off agitation: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కరోనా కారణంగా ఉద్యోగులు అర్ధం చేసుకొని ఆందోళన విరమించాలని రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, బానినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం సబబు కాదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సహకరించాలని సిఎం కూడా చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు కమిటీ కూడా వేశారని, ఉన్నంతలో ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు. ఉద్యోగులను హౌస అరెస్టులు చేయలేదని, అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పామన్నారు.

ఉద్యోగులకు సీఎం జగన్ ఎప్పుడు అనుకూలంగానే ఉంటారని, అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.  గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్దితి ఇబ్బందిగా ఉన్న వియం ఉద్యోగులు గుర్తుంచుకోవాలన్నారు.  ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు వ్యతిరేకం కాదని , విద్యుత్ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు ఒకేసారి ఇచ్చామని  వివరించారు. మార్చిలో పీఆర్సీ కమిటీ వేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని బాలినేని భరోసా ఇచ్చారు.  పరిస్దితులు గమనించి ఉద్యోగులు ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : మరోసారి రాష్ట్రానికి అన్యాయం: సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్