Friday, March 20, 2026
Homeసినిమాఆకాశ్ పూరికి మాస్ కంటెంట్ కలిసొచ్చేనా?

ఆకాశ్ పూరికి మాస్ కంటెంట్ కలిసొచ్చేనా?

Akash- Mass: తెలుగులో మాస్ ఫాలోయింగ్ .. మాస్ ఇమేజ్ కావాలనుకునే హీరోలు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఎందుకంటే ఆయన చూపించే మాస్ హీరోయిజం ఒక రేంజ్ లో ఉంటుంది.  అలాంటిది ఆయన తనయుడు ఆకాశ్ పూరి మాత్రం మరొకరి దర్శకత్వంలో మాస్ టచ్ ఉన్న రొమాంటిక్ డ్రామా చేశాడు .. ఆ సినిమా పేరే ‘చోర్ బజార్‘. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కథను చాలా సహజంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లడంలో జీవన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన ‘జార్జి రెడ్డి’ సినిమానే అందుకు నిదర్శనం.

ఇంతవరకూ ఆకాశ్ పూరి యూత్ మనసులను గెలుచుకునే సినిమాలను చేస్తూ వచ్చాడు. యాక్షన్ టచ్ తో కూడిన  రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు. అయితే ఆ సినిమాలు హిట్ అని చెప్పలేం .. అలాగని మరీ తీసికట్టు సినిమాలని అనలేం. ఇక ఆకాశ్ పూరి యాక్టింగ్ వైపు నుంచి కూడా ఎలాంటి లోపాలు కనిపించవు. అలాగని హీరోగా ఈ కుర్రాడికి ఒక  ఫాలోయింగ్ ఏర్పడిందా అంటే డౌటే. అలాంటి ఈ పరిస్థితుల్లో ఆకాశ్ పూరి ఈ సారి తన రొమాంటిక్ లవ్ స్టోరీకి పక్కా మాస్ యాక్షన్ జోడిస్తూ ‘చోర్ బజార్’తో రంగంలోకి దిగాడు.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ అయితే  ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా గెహనా సిప్పీ పరిచయమవుతోంది. కీలకమైన పాత్రలో సీనియర్ నటి ‘అర్చన’ నటించగా, ముఖ్యమైన పాత్రలలో సునీల్ .. సుబ్బరాజు .. సంపూ  కనిపించనున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఆ రోజునే దాదాపు అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే అయినా గుంపులో గోవిందా అవుతుందా ఏంటి అనే టెన్షన్ మేకర్స్ కి లేకపోలేదు.

Also Read బాలకృష్ణ చేతుల మీదుగా ‘చోర్ బజార్’’ ట్రైలర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular