Sunday, March 3, 2024
HomeTrending Newsపోలీసుల వైఖరితోనే ఉద్రిక్తత - రేవంత్ రెడ్డి

పోలీసుల వైఖరితోనే ఉద్రిక్తత – రేవంత్ రెడ్డి

ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈడీ కేసులతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లను ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. చలో రాజ్ భవన్ ముట్టడిలో రేవంత్ రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్ భవన్ ముట్టడి లో అరెస్ట్ ఐనా నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి కోసమే బిజెపి డ్రామాలు ఆడుతోందని, మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్ సోనియాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

గత మూడు రోజులుగా చేసిన నిరసనల్లో చిన్న ఘటనలు కూడా జరగలేదని, గాంధీ సిద్ధాంతంలోనే నిరసనలు, ఆందోళనలు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్ భవన్ ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే.. పోలీసులు రెచ్చగొట్టారని మండిపడ్డారు. లాఠీ ఛార్జి చేసి సీఎల్పీ నేత భట్టి, రేణుక చౌదరిలను పోలీసులు హ్యాండిల్ చేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. నేతలకు, శ్రేణులకు పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే రాష్ట్రము వచ్చేదా అని ప్రశ్నించారు. టీఆరెస్ వాళ్ళు.. బిజెపి అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోండి.. మాకు ఇబ్బంది లేదని, కానీ మా జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రాలలో కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. జిల్లాలోని రైల్వే స్టేషన్లు, టెలికామ్, lic, పోస్టల్ డిపార్ట్ మెంట్ లముందు నిరసన తెలపాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరంగా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసులు ఒక్క కలం పోటుతో కొత్తివేస్తామని, వెంటనే సోనియా, రాహుల్ లకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై లాఠీ ఛార్జి చేసిన పోలీసులపై సర్కార్ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్