Tuesday, June 9, 2026
Homeసినిమాఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి

ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం కోసం పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

త్వ‌ర‌లో ఈ మూవీని థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌. రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్య‌ప్ సంగీతం అందించారు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌ జంటగా నటించిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ట‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన‌ ప్రధాన పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular