Tuesday, June 9, 2026
Homeసినిమానట్టికుమార్ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

నట్టికుమార్ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35పై దర్శక నిర్మాత నట్టికుమార్ వేసిన పిటిషన్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పందించింది. ఈ జీవోను కొంత మంది థియేటర్ల యజమానులు అమలు పరచకుండా… తమ ఇస్టానుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని నట్టికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీని పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని…తక్షణమే ఈ అన్యాయం, దోపిడీ పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

శనివారం హైకోర్టులో వాదనలు జరిగాయని, ఈ జీవో 35పై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ నాలుగు వారాల్లోగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని నట్టికుమార్ మీడియాకు తెలిపారు.

ఈ జీవో అమలు చేయకుండా ప్రేక్షకుల డబ్బును దోచుకుంటున్నారని, కొందరు స్థానిక అధికారులు కూడా దీనికి సహకరిస్తున్నందువల్ల దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి నిర్మాత నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular