Friday, March 29, 2024
Homeసినిమాగోపీచంద్‌ ‘సీటీమార్‌’ సెన్సార్ పూర్తి. 10న రిలీజ్‌కు సిద్ధం

గోపీచంద్‌ ‘సీటీమార్‌’ సెన్సార్ పూర్తి. 10న రిలీజ్‌కు సిద్ధం

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఇక సీటీమార్ థియేట‌ర్స్ సంద‌డికి సర్వం సిద్ధ‌మైన‌ట్టే.

శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మేం నిర్మించిన ‘సీటీమార్‌’ రిలీజ్ కు సిద్ధమైంది. పండ‌గ‌కు కుటుంబం అంతా క‌లిసి ఎలాంటి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూడాల‌నుకుంటారో అలాంటిదే మా ‘సీటీమార్‌’. వినాయ‌క చ‌వితి కానుకగా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ సంపత్ నందిగారు మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్లను పక్కాగా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా తీశారు. మా ‘సీటీమార్’ వంద శాతం ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ లా ఉంటుంది’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్