Sunday, January 19, 2025
Homeసినిమాఅదరగొట్టిన ‘అఖండ’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

అదరగొట్టిన ‘అఖండ’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

Akhanda Records:
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అఖండ‌’. ఈ భారీ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్డ్ డే ఫ‌స్ట్ షో నుంచి అంచ‌నాల‌కు మించిన క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఇంత‌కీ అఖండ ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందంటే…

నైజాం – 4.39కోట్లు, సీడెడ్ –  4.02 కోట్లు, యు.ఎ 1.36 కోట్లు, ఈస్ట్ – 1.05కోట్లు, వెస్ట్ – 96 ల‌క్ష‌లు, గుంటూరు – 1.87 కోట్లు, కృష్ణ – 81 ల‌క్ష‌లు, నెల్లూరు – 93 ల‌క్ష‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో క‌లిపి 15.39కోట్లు షేర్ 23 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో ప్రీమియ‌ర్ షో అండ్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ తో హాఫ్ మిలియ‌న్ క్రాస్ చేసింద‌ని స‌మాచారం. సెకండ్ వేవ్ త‌ర్వాత హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన‌ తెలుగు సినిమాగా అఖండ స‌రికొత్త‌ రికార్డ్ సృష్టించింది.

Also Read : ‘అఖండ‌’కు అనూహ్య స్పంద‌న‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్