Sunday, January 19, 2025
Homeసినిమా'అఖండ' సీక్వెల్ కు డేట్ ఫిక్స్?

‘అఖండ’ సీక్వెల్ కు డేట్ ఫిక్స్?

నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందాయి. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే… అఖండ చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఇందులో బాలయ్య పోషించిన రెండు పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో బాలయ్య తప్పా… ఇంకెవరూ ఆ పాత్రలను అంత అద్భుతంగా చేయలేరు అంటూ సినీ జనాలే కాకుండా సామాన్య జనాలు కూడా అభినందించారు.

దీంతో అఖండ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అఖండ సీక్వెల్ చేయాలని బాలయ్య, బోయపాటి ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా.. అఖండ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడు అఖండ సీక్వెల్ స్టార్ట్ అవుతుందా అని బాలయ్య అభిమానులు వెయిట్ చేస్తున్నారు.  అఖండ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డే అఖండ సీక్వెల్ కూడా నిర్మించాలి అనుకుంటున్నారు. ఇక ఈ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ ఏంటంటే… జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు. ఆ రోజున ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను.. రామ్ తో మూవీ చేస్తున్నారు. అటు బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ, ఇటు బోయపాటి, రామ్ మూవీ కూడా దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తైన తర్వాత అఖండ సీక్వెల్ స్టార్ట్ చేస్తారట. బాలయ్య పుట్టినరోజున మాత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కానీ… అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కానీ చేస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్