Monday, June 15, 2026
HomeTrending Newsకెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటి

కెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటి

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమాజ్ వాదీ పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారు. దాదాపు గంటన్నర నుంచి కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ రాజకీయాల్లో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు వాటిని ఎదుర్కోనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలో అఖిలేష్ యాదవ్ తో పాటు ఎస్పీ ఎంపి రాంగోపాల్ యాదవ్ కుడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular