Saturday, January 18, 2025
Homeసినిమా‘లాల్ సింగ్ చద్దా’ అమీర్ తో నాగచైతన్య

‘లాల్ సింగ్ చద్దా’ అమీర్ తో నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య.. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో అమీర్ ఖాన్ తో కలిసి నటించనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి చైతన్య మాట్లాడలేదు. అమీర్ ఖాన్, కిరణ్ రావు, డైరెక్టర్ అద్వైత్ చందన్ లో ఉన్న ఫోటోను నాగచైతన్య ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడి చేశాడు. హాలీవుడ్‌లో సక్సస్ సాధించిన ఫారెస్ట్‌ గంప్‌ మూవీకి రీమేక్‌గా ఇది రూపొందుతోంది. కరీనా కపూర్‌ కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. లద్దాఖ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు.

తాజా షెడ్యూల్ లో అమీర్ ఖాన్, చైతూల పై కార్గిల్‌ వార్‌ నేపథ్యంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. నాగచైతన్య బాలీవుడ్ లో నటిస్తున్న ఫస్ట్ మూవీలోనే అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తుండడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్