Friday, March 29, 2024
HomeTrending Newsకోవిశీల్ద్ కు 15 యూరోప్ దేశాల గుర్తింపు

కోవిశీల్ద్ కు 15 యూరోప్ దేశాల గుర్తింపు

యురోపియన్ యూనియన్ లోని 15 దేశాలు కోవిశీల్ద్ వ్యాక్సిన్ గుర్తించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) వెల్లడించింది. తాజాగా బెల్జియం దేశం కూడా కోవిశీల్ద్ టీకా గుర్తించిందని సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దీంతో యూరోప్ వెళ్ళే భారత ప్రయాణీకులకు ఉపశమనం లభించినట్లైంది.
భారత్ కు చెందిన సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిశీల్ద్ , అస్త్రజేనికా పేరుతో వివిధ దేశాల్లో ఇప్పటికే వాడుకలో ఉంది. యురోపియన్ దేశాల నిర్ణయంతో ముఖ్యంగా దక్షిణాసియ దేశాలకు శుభవార్తగా చెప్పవచ్చు. భారత్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి యూరోప్ వెళ్ళే ప్రయాణికులకు టీకా ఇబ్బందులు తొలిగాయి.
ఈయు దేశాలల్లో స్విట్జర్లాండ్, ఐస్ లాండ్, తదితర దేశాలు ఇదివరకే కోవిశీల్ద్ టీకాను గుర్తించాయి. భారత ప్రభుత్వం గుర్తించిన అన్ని టీకాలు తమ దేశంలో చెల్లుతాయని ఎస్టోనియా గతంలోనే ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్