Thursday, March 28, 2024
HomeTrending Newsసంక్షోభ కాలంలోనూ ఆగని పట్టణాభివృద్ధి

సంక్షోభ కాలంలోనూ ఆగని పట్టణాభివృద్ధి

సంక్షోభ పరిస్థితులను అవకాశంగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పురపాలక శాఖ శానిటేషన్, ఇంజనీరింగ్ అభివృద్ధి విభాగాలు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందాయని అభినందించారు. ప్రగతి భవన్ లో  శుక్రవారం ఉదయం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక “ప్రగతి నివేదిక”ను పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పురపాలికల్లో లాక్ డౌన్ పరిస్థితులను వినియోగించుకొని పెద్ద ఎత్తున మౌలికవసతుల కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు.

దేశంలో వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర నగర జనాభాలో సింహభాగాన్ని కలిగియున్న హైదరాబాద్ తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా మనుగడ కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి  కె .చంద్రశేఖర రావు గారి  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని, అందుకుగాను గత ఏడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలు ఇందుకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల్లోని పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పురపాలక శాఖ పని చేస్తూ వస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, వాటర్ బోర్డు వాటర్ వర్క్స్ శివరాజ్ బోర్డు దాన కిషోర్, సిడిఎంఏ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, మెట్రో రైల్ ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి, హెచ్ఎండిఎ సెక్రెటరీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్