Sunday, January 19, 2025
HomeTrending Newsనాగ్ నెక్ట్స్ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

నాగ్ నెక్ట్స్ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. కరోనా సెకండ్ వేవ్ లో థియేటర్లో రిలీజైనప్పటికీ ప్రేక్షకాభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో నాగచైతన్య మాస్ క్యారెక్టర్ తో మెప్పించడం విశేషం. ఈ సినిమా తర్వాత నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్ కు నార్త్ లో ట్రెమండస్ రెస్పాన్స్ రావడం విశేషం.

బంగార్రాజు, బ్రహ్మాస్త్రం చిత్రాలతో పాటు ఈ సంవత్సరం దసరాకి నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ రిలీజైంది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ది ఘోస్ట్ మూవీ పై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేదు. దీంతో నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహనరాజా డైరెక్షన్ లో ఓ మూవీ చేయాలి అనుకున్నారు. ది ఘోస్ట్ రిలీజైన వెంటనే ఈ సినిమాను అనౌన్స్ చేస్తానన్నారు కానీ.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… రచయిత బెజవాడ ప్రసన్న చెప్పిన స్టోరీ నాగార్జునకు నచ్చిందట. డైరెక్షన్ చేసే ఛాన్స్ ప్రసన్నకే ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాకు పీరియాడికల్ స్టోరీ ఆధారమని తెలిసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ టచ్ వున్న కథ కావడంతో నాగ్ ఓకే చెప్పారని సమాచారం. ముఫై నలభై ఏళ్ల వెనుక కాలంలో నడుస్తుందట. సోగ్గాడే చిన్ని నాయనా తరువాత నాగ్ నుంచి మాంచి ఎంటర్ టైనర్ రాలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చేలా వుంటుందట. త్వరలో ఈ సినిమాను ప్రకటించనున్నారు. మరి.. ఈ సినిమాతో నాగార్జున మళ్లీ మరో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్