Saturday, July 27, 2024
Homeసినిమావిజయ్ మూవీలో అక్కినేని హీరో..?

విజయ్ మూవీలో అక్కినేని హీరో..?

విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత చాలా కథలు విని ఆఖరికి గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీని ప్రకటించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందే ఈ సినిమా కోసం విజయ్ తన లుక్ ను పూర్తిగా మార్చేస్తున్నాడట. అయితే.. ఈ కథను ముందుగా గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కు చెప్పాడు. కథ విని చేస్తానని చెప్పాడు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది.

ఆతర్వాత చరణ్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కారణం ఏంటంటే.. ఇందులో హీరో క్యారెక్టర్ పోలీస్. అయితే.. ఆర్ఆర్ఆర్ లో ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. దీంతో గౌతమ్ విజయ్ కి కథ చెప్పి ఫైనల్ చేసుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ని గౌతమ్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. గౌతమ్ కి దర్శకుడిగా మొదటి అవకాశం మళ్ళీరావా సినిమాతో సుమంత్ ఇచ్చాడు. అలాగే సుమంత్ కి ఆ మూవీతో చాలా కాలం తర్వాత హిట్ వచ్చింది.

ఈ సీనియర్ హీరో ఇప్పుడు ఇతర హీరోల సినిమాలలో కూడా కూడా కీలక పాత్రలు చేయడానికి రెడీ అయ్యాడు. ఇటీవల సీతారామం సినిమాలో హీరో, హీరోయిన్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు విజయ్, గౌతమ్ మూవీలో కూడా అలాంటి ఇంపార్టెంట్ పాత్రలో సుమంత్ నటించేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సినిమాతో కూడా సుమంత్ మంచి పేరు దక్కించుకుంటాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్