Sunday, November 24, 2024
HomeTrending Newsఐఏఎస్‌,ఐపీఎస్​ల క్యాడర్ అంశం...27కు వాయిదా

ఐఏఎస్‌,ఐపీఎస్​ల క్యాడర్ అంశం…27కు వాయిదా

ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణను హైకోర్ట్ ఈ నెల 27 కు వాయిదా వేసింది .  12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్  ఇవాళ  విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్ లను  రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని సూచించారు. అయితే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని  అధికారుల తరపు అడ్వొకేట్ లు కోర్టుకు  తెలుపగా తదుపరి విచారణను 27 కు వాయిదా వేసింది.

ఏపీ క్యాడర్‌‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల క్యాడర్‌‌ పై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే సోమేశ్‌ కుమార్ క్యాడర్ విషయంలో వారం కిందటే హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు రావడంతో ఆయన తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో రిపోర్ట్ చేశారు.

ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్​ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్​లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్, ఏవీ రంగనాధ్ ఉన్నారు. ఐఏఎస్‌లలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీ ప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్​ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి (ప్రస్తుతం సెంట్రల్ డిప్యూటేషన్) ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్​లో పనిచేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌‌కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకూ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ క్యాడర్‌‌కు చెందిన ఐఏఎస్‌లు శివశంకర్ లహోటి, హరి కిరణ్, గుమ్మల్ల సృజన ఏపీలో పనిచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్