Friday, October 18, 2024
HomeTrending Newsకాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్

కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను  ఏ.ఐ.సి.సి. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు దశబ్దాల అనుబందం ఉందన్న సుష్మిత పార్టీలో తన ఉన్నతికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. రాజీనామాకు కారణాలు వెల్లడించని సుష్మ పార్టీలో ప్రతిష్టాత్మకమైన పదవులు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీతో చేసిన సుదీర్గ రాజకీయ ప్రయాణం మరువలేనిదన్నారు. అస్సాం లోని  సిల్చేర్ లోక్ సభ స్థానం నుంచి సుష్మిత ప్రాతినిధ్యం వహించారు.

సుష్మిత దేవ్ రాజీనామాతో అస్సాం కాంగ్రెస్ షాక్ కు గురైంది. సుష్మిత దేవ్ తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత సంతోష్ మోహన్ దేవ్ కాంగ్రెస్ తరపున ఏడుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అస్సాం లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటం చర్చనీయంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలు రూప్ జ్యోతి కూర్మి, సుషాంత బోర్గోహిన్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ రాజీనామా చేసి బిజెపిలో చేరారు. సుష్మిత దేవ్ తన రాజీనామాకు కారణాలు కూడా వెల్లడించలేదు. అయితే సుష్మ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. యువకులంతా పార్టీని వీడి వెళ్తుంటే ఇక మాలాంటి వృద్దులే మిగిలారని, పార్టీలో జర్గుతున్న పరిణామాల్ని చూడటం తప్పితే చేసేది ఏమి లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా ప్రజాజీవనంలోనే ఉంటానని సుష్మిత దేవ్ స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త ప్రయాణం మొదలవుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే సుష్మిత తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. కలకత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రేయిన్ సమక్షంలో పార్టీలో చేరారు.

సుస్మిత – మమత బెనర్జీ తో చేతులు కలపటంతో అస్సాంలో రాబోయే కాలంలో తృణముల్ కాంగ్రెస్ బోణీ చేసే అవకాశం ఉంది.

అస్సామీలకు – బెంగాలీలతో బాషాపరమైన విభేదాలు ఉన్నా ఇటీవల ముస్లీములతో అస్సామీలకు ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో సుస్మిత దేవ్ రాకతో బెంగాలీ- అస్సామీ స్నేహం కొత్త శకానికి దారి తీయనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్