Friday, March 29, 2024
Homeసినిమాప్రభాస్ వెర్సెస్ బన్నీ..?

ప్రభాస్ వెర్సెస్ బన్నీ..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ ని షేక్ చేసింది. దీంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వైజాగ్ లో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్ లో భారీ షెడ్యూల్ చేయనున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారు కానీ.. సంక్రాంతికి మూవీ రెడీ కాదని.. వచ్చే సమ్మర్ లో పుష్ప 2 రిలీజ్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో హర్రర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ గా రాజా డీలక్స్ అనుకుంటున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ మూవీ కథ మొత్తం కూడా ఒక ప్యాలెస్ లో జరుగుతుందని తెలుస్తుంది. అయితే.. పుష్ప 2, ప్రభాస్ రాజా డీలక్స్ వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల అవుతాయని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు మధ్య సమ్మర్ వార్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్, బన్నీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మరి.. నిజంగానే ప్రభాస్, బన్నీ పోటీపడతారా..? అదే జరిగితే ఏ సినిమా బిగ్ సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్