Saturday, January 18, 2025
Homeసినిమా‘వేణు శ్రీరామ్’కు బన్నీ గ్రీన్ సిగ్నల్

‘వేణు శ్రీరామ్’కు బన్నీ గ్రీన్ సిగ్నల్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. బన్నీతో సినిమా చేసేందుకు దర్శకులు వేణుశ్రీరామ్, బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్, మురుగుదాస్, విక్రమ్ కుమార్ కథలు రెడీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తదుపరి చిత్రం ఎవరితో అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఈరోజు బన్నీ స్నేహితుడు, నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో బన్నీ తదుపరి చిత్రం పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ బన్నీ వాసు ఏం చెప్పారంటే.. పుష్ప పార్ట్ 1 తర్వాత వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఐకాన్’ మూవీ ఉంటుంది. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 ఉంటుందని చెప్పారు. కేజీఎఫ్‌, సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అల్లు అరవింద్ మాట్లాడారని, తప్పకుండా బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ ఉంటందని స్పష్టం చేశారు. అలాగే బోయపాటి శ్రీను, మురుగుదాస్ తో కూడా సినిమాలు చేయనున్నట్టు బన్నీ వాసు తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్