Saturday, January 18, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్ ట్రాక్ పైకి అల్లు శిరీష్ 'బడ్డీ' 

నెట్ ఫ్లిక్స్ ట్రాక్ పైకి అల్లు శిరీష్ ‘బడ్డీ’ 

అల్లు శిరీష్ తలచుకుంటే సొంత బ్యానర్లో వరుస సినిమాలు చేయగలడు. కానీ ఆయన అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ‘ఊర్వశివో రాక్షసివో’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఆయనకి హిట్ తెచ్చిపెట్టలేకపోయింది. ఆ సినిమా తరువాత దాదాపు రెండేళ్లకి ఆయన మరో సినిమానును థియేటర్లకు తీసుకుని రాగలిగాడు. ఆ సినిమా పేరే ‘బడ్డీ’.

ఈ నెల 2వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. హిప్ హాప్ తమిళ బాణీలను అందించిన ఈ సినిమాకి పబ్లిసిటీ కూడా బాగానే చేశారు. గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాతో హీరోయిన్ గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. అయితే టైటిల్ కారణంగా .. పోస్టర్స్ వలన ఆరంభం నుంచే ఇది చిన్నపిల్లలకు నచ్చే కాన్సెప్ట్ అనే ఒక ముద్ర పడిపోయింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) వైజాగ్ లో పైలెట్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడే ఎయిర్ కంట్రోలర్ గా ఉన్న పల్లవి (గాయత్రి భరద్వాజ్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది .. అది ప్రేమగా మారుతుంది. అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో ఆదిత్య రామ్ కి పల్లవి కనిపించకుండా పోతుంది. అతనికి తన ఆచూకీ తెలియజేయడం కోసం పల్లవి ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి ప్రవేశిస్తుంది. టెడ్డీలో తాను ఉన్నాననే విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె ఆత్మగా మారడానికి కారణం ఏమిటి? అది తెలుసుకున్న ఆదిత్య రామ్ ఏం చేస్తాడు? అనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్