Monday, February 24, 2025
HomeTrending Newsకాపుల ఓట్ల కోసం పవన్ కు గాలం: రాంబాబు

కాపుల ఓట్ల కోసం పవన్ కు గాలం: రాంబాబు

Babu Pet: చంద్రబాబును మళ్ళీ సిఎం చేసేందుకు, వైఎస్ జగన్ ను గద్దె దించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్  రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపుల ఓట్ల కోసమే పవన్ కు బాబు గాలం వేశారని,  కానీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీని గద్దె దించలేరని సవాల్ విసిరారు.  ‘అయన పవన్ కళ్యాణ్ కాదని, చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పక్షమని, పవన్ కు సొంత ఆలోచన అనేదే లేదని విమర్శించారు.  ఈ విషయాన్ని తెలుగు ప్రజలు, తెలగ ప్రజలు లోతుగా ఆలోచిస్తే చాలా వివరంగా అర్ధమతున్దన్నారు. నిన్న చింతలపూడిలో వైసీపీ, సిఎం జగన్ లపై పవన్ చేసిన విమర్శలకు మంత్రి రాంబాబు స్పందించారు.

తనపై సెటైర్లు వేయవద్దని చెబుతున్న పవన్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంత్రి శ్రీనివాస్ లతో పాటు తనను కూడా ర్యాంబో రాంబాబు అంటూ సంబోధించారని… అంటే సెటైర్లు వేసే హక్కు మీ ఒక్కడికే ఉందా అని ప్రశించారు. ‘నారావారి దత్తపుత్రుడు’; ‘బాబు వారి దత్తపుత్రుడు’ అనే టైటిల్స్ తో సినిమాలు  తీయాలని ఉందని తీస్తామని, కాకపొతే ఐదారుగురు హీరోయిన్లు కావాల్సి ఉంటుందని, అందుకే కష్టంగా ఉందని… డైరెక్టర్ ను ఎవరో ఒకరిని పట్టుకొస్తామని, నిర్మాత దొరకడమే కష్టంగా రాంబాబు వ్యంగ్యాస్త్రం సంధించారు. దత్తపుత్రుడివి కాకపొతే ఎందుకు చాకిరీ చేస్తున్నారంటూ రాంబాబు నిలదీశారు.

ఏదో చెట్టుకింద బజ్జీలు అమ్ముకుని బతుకుతున్నానన్నట్లుగా ఏదో సినిమాలు చేసుకుని బతుకుతున్నా అని పవన్ చెబుతున్నారని, ‘అసలు మీ రెమ్యునరేషన్ ఎంత, ఇది కాకుండా బాబు రూపంలో మీకో డబ్బులు గుద్దే మిషన్ ఉందిగా’ అంటూ దుయ్యబట్టారు. రఘురామకృష్ణం రాజు దర్శకత్వంలో, చంద్రబాబు ధన సహాయంతో యాత్రలు చేస్తూ, మమ్మల్ని గద్దె దించడం మీవల్ల కాదు కదా, ఆ చంద్రబాబు వల్ల కూడా కాదు అని అంబటి తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్