Thursday, April 3, 2025
Homeస్పోర్ట్స్Wrestling: అంతిమ్ కు అమిత్ షా అభినందన

Wrestling: అంతిమ్ కు అమిత్ షా అభినందన

బల్గేరియాలో జరుగుతోన్న అండర్-20  వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించిన అంతిమ్ పంఘల్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ శా అభినందించారు.  నిన్న జరిగిన ఫైనల్లో అంతిమ్  8-0 తేడాతో కజకిస్థాన్ క్రీడాకారిణి అట్లీన్ పై విజయం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

“ఇదో గర్వకారణమైన సందర్భం, అంతిమ్ కు అభినందనలు, అండర్ -20 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెల్చుకొన్న తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.  నీ కృషి, అంకిత భావానికి దేశం మొత్తం శాల్యూట్ చేస్తోంది.  బెస్ట్ విషెస్, భవిష్యత్ లో ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా” అంటూ  అమిత్ షా ట్వీట్ చేశారు.

62, 65కిలోల విభాగంలో సోనమ్ మాలిక్, ప్రియంక రజత పతకాలు గెల్చుకోగా, 57, 72 కిలోల విభాగంలో సిటో, రితిక కాంస్య పతకాలు సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్