Monday, May 20, 2024
HomeTrending Newsబిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు - రేవంత్ రెడ్డి

బిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు – రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రధాన పార్టీల అగ్ర నేతలందరూ ఈ రోజు మునుగోడుకు వెళుతున్నారు.  సిఎం కెసిఆర్ బహిరంగసభ ఈ రోజు ఉండగా రేపటి అమిత్ షా సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మునుగోడులోనే ఉన్నారు. రాజీవ్ గాంధి జయంతి నేపథ్యంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మునుగోడు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. నారాయణ పురం మండలం పొర్లగూడ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేసి రేవంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 176 గ్రామాలకు చేరిన కాంగ్రెస్ నేతలు… అన్ని గ్రామాల్లో రాజీవ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మన మునుగోడు..మన కాంగ్రెస్ నినాదంతో జనంలోకి వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యం కాపాడండని పాదాభి వందనం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా లక్ష మందికి కాంగ్రెస్ నేతలు పాదాభి వందనం చేయనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టని కెసిఆర్ ఓట్ల కోసం వస్తున్నారని పిసిసి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాంతంలో మూడు వందల కోట్ల వ్యవసాయ రుణ మాఫీ జరగాల్సి ఉండే కానీ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన వారిని తెరాస లో కెసిఆర్ చేర్చుకుంటున్నారు. పిరాయింపులతో తెలంగాణను విష ప్రయోగ శాల చేశారని కెసిఆర్ ను దుయ్యబట్టారు. హుజురాబాద్ లో నైతిక విలువల గురించి మాట్లాడి.. హరీష్ రావు డబ్బు కట్టలతో వస్తున్నాడని విమర్శించిన నేత ఇప్పుడు బిజెపి చేరికల కమిటీ చైర్మన్ గా ఫిరాయింపులను ఎలా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నియోజక వర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే… బిజెపి నుంచి గెలిచిన వారు రాజీనామా చేయించాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చేర్చుకుంటున్న బిజెపి వారితో రాజీనామా చేయిస్తే గ్రామాలకు నిధులు వచ్చి అభివృద్ధి జరగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : దేనికోసం కెసిఆర్ మునుగోడు సభ కిషన్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్