Saturday, April 20, 2024
HomeTrending Newsమునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

కొన్ని రోజులుగా రాజీనామా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి సిఎం కెసిఆర్, కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తన రాజీనామా తర్వాత ఉపఎన్నిక వస్తేనైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందేమోనని, తన ప్రజలకు మేలు జరుగుతుందేమోనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

నియోజకవర్గంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మీకు ఏది మంచి అనిపిస్తే.. ఆ నిర్ణయం తీసుకోమని కార్యకర్తలు తనతో చెప్పారని ఆయన వెల్లడించారు. స్పీకర్ అపాయింట్‌మెంట్ తీసుకొని త్వరలో రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి.. బీజేపీ పార్టీలో చేరే అంశంపై ఆచి తూచి స్పందించారు. అయితే, రేవంత్ రెడ్డి నాయకత్వంపై మాత్రం ఘాటు విమర్శలు చేశారు. అదే సమయంలో నరేంద్ర మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీ పార్టీనే సరైన ప్రత్యామ్నాయం అని భావిస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. బయటి నుంచి వచ్చిన వాళ్ల కింద పనిచేయాలా? ఆత్మగౌరవం ఉన్నవాళ్లం ఎలా పని చేయగలుగుతాం? కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీల్లోనూ సామాజిక న్యాయం పాటించట్లేదు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పరోక్షంగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు కురిపించారు.

నిందలు మోసి, కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసి ఇన్ని నిందలు పడటం అవసరమా? మా వ్యాపార కార్యక్రమాలన్నీ నా కుమారుడు నడిపిస్తున్నాడు. నేను రాజకీయాలకు, వ్యాపారానికి ఏనాడు ముడిపెట్టలేదు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Also Readకెసిఆర్ తోనే నా యుద్ధం రాజగోపాల్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్