Friday, March 29, 2024
HomeTrending Newsతైవాన్ లో నాన్సీ పెలోసీ..చైనా హెచ్చరికలు బేఖాతర్

తైవాన్ లో నాన్సీ పెలోసీ..చైనా హెచ్చరికలు బేఖాతర్

చైనా ఆగడాలను ప్రశ్నిస్తూ వస్తున్న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుకున్నట్టుగానే తైవాన్‌ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ ప్రతిచర్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా చేసిన హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ నాన్సీ పెలోసీ తైవాన్ కు బాసటగా నిలిచారు. తైపీలో అడుగు పెట్టగానే, తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతు కొనసాగిస్తామని, ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో చ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ట్వీట్‌ చేసి మరి.. నాన్సీ పెలోసీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు.

నాన్సీ పెలోసీ రాకపై తైవాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, పెలోసీని ఉక్కు మహిళగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఏ మాత్రం రాజీపడకుండా వ్యవహరించే నాన్సీ పెలోసీ…తైవాన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అంతర్జాతీయంగా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.

నాన్సీ పెలోసీ రాకపై అమెరికా మూల్యం చెల్లిస్తుందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ గగనతలం వైపు ఫైటర్‌ జెట్స్‌ను పంపడంతో పాటు ఆ దేశ ప్రభుత్వ వెబ్‌సైట్లను డ్రాగన్‌ హ్యాక్‌ చేసింది. US హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో అడుగుపెట్టగానే.. 20కి పైగా చైనా సైనిక విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి వెళ్లాయని తైపీలోని అధికారులు తెలిపారు.

తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికా… నాలుగు యుద్ధ నౌకలను తైవాన్‌ ద్వీపానికి తూర్పులో మొహరించింది. చైనా ప్రతి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశాన్ని అమెరికా నిషితంగా గమనిస్తోంది.

Also Read తైవాన్ వ్యవహారంలో చైనా – అమెరికా మాటల యుద్ధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్