Sunday, September 8, 2024
HomeTrending NewsIndonesia: ఇండోనేషియాలో భూకంపం

Indonesia: ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 70.2 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. తనింబార్ దీవులను తైమూర్ లౌట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 65 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

అగ్నిపర్వతాలకు నిలయమైన ద్వీపాల సమూహం ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెల అక్కడ భూకంపం రావడం సాధారణంగా మారిపోయింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్