Thursday, April 17, 2025
HomeTrending Newsచెట్లకు రాఖీలు...

చెట్లకు రాఖీలు…

రక్షాబంధన్‌ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర్‌లో స్థానికులు చెట్లకు రాఖీలు కట్టారు.

ఈ సంవత్సరం పర్యావరణంతో తమ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నామని స్థానికుడు ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల చెట్లను పెంచడం, వాటిని రక్షించడంపై తర్వాత తరాల వారు నేర్చుకుంటారని అన్నారు. అందుకే రక్షాబంధన్‌ రోజున పిల్లలు, పెద్దలతో చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్