Saturday, January 18, 2025
Homeసినిమా‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ రిలీజ్

‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ రిలీజ్

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరో హీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ  ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

దర్శకుడు సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ “మా చిత్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరించి.. మా టీమ్‌ని బ్లెస్ చేసిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. సినిమా విషయానికి వస్తే.. ‘ప్రేమదేశపు యువరాణి’ టైటిల్ ప్రకటించగానే మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. నాకు సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నిర్మాతలు అందించిన సహకారం మరువలేనిది. అతి త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాము. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అలాగే కాసర్ల శ్యామ్ గారి పాటలు, ఆర్పీ పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే చిత్రంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్