Tuesday, June 16, 2026
Homeసినిమా'VS11' లో రత్నమాలగా అంజలి

‘VS11’ లో రత్నమాలగా అంజలి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అత్యంత వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు  అభిరుచితో నిర్మిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆసక్తికరమైన చిత్రం ‘VS 11’ వస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. విలక్షణ నటి అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నారు.

అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular